షాకింగ్.. కొవాగ్జిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్.. తేల్చేసిన బనారస్ యూనివర్సిటీ పరిశోధకులు

by Mahesh |
షాకింగ్.. కొవాగ్జిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్.. తేల్చేసిన బనారస్ యూనివర్సిటీ పరిశోధకులు
X

దిశ, వెబ్‌డెస్క్: 2020 సంవత్సరంలో కోవిడ్-19 కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించింది. ఈ వ్యాధి కారణంగా లక్షల సంఖ్యలో ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు. అలాగే పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి. ఈ క్రమంలో దేశంలోని పలు కంపెనీలు కరోనా వైరస్ పై రీసెర్చ్ చేసి.. ప్రాణాంతక వ్యాధి నుంచి రక్షించుకునేందుకు వ్యాక్సిన్ ను తయారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా పలు కీలక కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేయగా.. అందులో కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఒకటి. అయితే తాజాగా కోవాగ్జిన్ తో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లు బనారస్ హిందూ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. ఈ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు కొవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న 635 మంది టీనేజర్లు, 291 మంది పెద్దలపై సంవత్సరం పాటు పరిశోదనలు చేసినట్లు తెలిపారు.

కాగా వీరిలో 304 మంది టీజేజర్లు(47.9)శాతం, 124 మంది పెద్దల్లో శ్వాసకోశ సమస్యలు, 4.6 శాతం మంది మహిళల్లో రుతుక్రమ సమస్యలు, 2.7 శాతం మందిలో కంటిచూపు, 10.5 శాతం మందిలో చర్మ సమస్యలు వచ్చినట్లు తేల్చారు. 4.7 శాతం మందిలో నరాల సంబంధిత వ్యాధులను గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మొదట భారత్ తయారు చేసిన కోవిషీల్డ్ తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని కోర్టులో సంస్థ ఒప్పుకోగా.. ప్రస్తుతం హిందూ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో కొవాగ్జిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని తేలడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Next Story