- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల ఉక్కుపాదం
జూదం, బెట్టింగ్ వంటి అక్రమ కార్యకలాపాలు వ్యక్తులకుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

దిశ. లింగంపేట : జూదం, బెట్టింగ్ వంటి అక్రమ కార్యకలాపాలు వ్యక్తుల కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల ఆర్థిక నష్టాలతో పాటు సామాజిక సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయని పేర్కొన్నారు. జిల్లాలో అక్రమ జూదం, పేకాట, బెట్టింగ్ స్థావరాలపై నిరంతర నిఘా కొనసాగుతోందని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేసిన వివరాలను ఆయన వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లాలోని బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలోని కందర్‌పల్లి గ్రామ శివారులో ఎస్‌ఐ జి. రాజు ఆధ్వర్యంలో సోమవారం పోలీస్ సిబ్బంది ప్రత్యేక దాడి చేసి పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.5,230 నగదు, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకు న్నట్లు చెప్పారు. మరో ముగ్గురు నిందితులు పారిపోయినట్టు ఆయన పేర్కొన్నారు. అదే విధంగా ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామ అటవీ ప్రాంతంలో హెడ్ అండ్ టెయిల్ జూదం ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, మరో ఆరుగురు వ్యక్తులు పరారైనట్లు చెప్పారు. వారి వద్ద నుంచి రూ.11,200 నగదు, 13 ద్విచక్ర వాహనాలు మరియు 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు . కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్పీ ప్రకటించారు. జిల్లాలో ఎక్కడైనా జూదం, పేకాట, బెట్టింగ్ లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-100కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని జిల్లా ఎస్పీ తెలిపారు.






