- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువత భవిష్యత్తు కోసం గంజాయి పై పోలీసుల ఉక్కుపాదం
యువత భవిష్యత్తును మత్తుపదార్థాల బారిన పడకుండా కాపాడాలనే లక్ష్యంతో కారేపల్లి పోలీసులు గంజాయి అక్రమ విక్రయాల పై ఉక్కుపాదం మోపారు.

దిశ, కారేపల్లి : యువత భవిష్యత్తును మత్తుపదార్థాల బారిన పడకుండా కాపాడాలనే లక్ష్యంతో కారేపల్లి పోలీసులు గంజాయి అక్రమ విక్రయాల పై ఉక్కుపాదం మోపారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు గురువారం కారేపల్లి ఎస్సై బైరు గోపి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. కారేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాన్‌షాపులు, కిరాణా దుకాణాలు, అనుమానాస్పద వ్యాపార కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయిని చాక్లెట్లు, సిగరెట్లు, పౌడర్ రూపాల్లో విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గంజాయి హాట్‌స్పాట్‌లుగా గుర్తించిన ప్రాంతాల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్సై తెలిపారు.
పాన్‌షాపులు, కిరాణా దుకాణాల ముసుగులో ఎలాంటి అక్రమ కార్యకలాపాలు జరిగినా సహించబోమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కారేపల్లి ఎస్సై బైరు గోపి మాట్లాడుతూ మత్తు పదార్థాల అక్రమ విక్రయాలకు పాల్పడే వారి పై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు, యువత భవిష్యత్తును నాశనం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రజలు తమ పరిసరాల్లో గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మత్తు పదార్థాల నిర్మూలనకు కారేపల్లి పోలీసులు చేపడుతున్న ప్రత్యేక తనిఖీలను స్థానికులుఅభినందించారు. యువత భవిష్యత్తు పరిరక్షణ కోసం ఎస్సై ఆధ్వర్యంలో పోలీసులు చూపుతున్న అప్రమత్తత ఆదర్శనీయమని పలువురు అభిప్రాయపడ్డారు.






