ప్రభుత్వ విద్యార్థులకు అందించే యూనిఫామ్స్ నాణ్యంగా ఉండాలి

by Taduka Kalyani |

ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తులు నాణ్యవంతంగా ఉండాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ విద్యార్థులకు అందించే యూనిఫామ్స్ నాణ్యంగా ఉండాలి
X

దిశ ప్రతినిధి నిర్మల్ : ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తులు నాణ్యవంతంగా ఉండాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం నిర్మల్ పట్టణంలోని స్కంద ఔట్ ఫిట్ కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తుల తయారీ తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా దుస్తుల తయారీకి సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే దుస్తులు నాణ్యవంతంగా ఉండాలని పేర్కొన్నారు. సమయానికి యూనిఫాంలు తయారు చేసి విద్యార్థులకు అందించాలని తెలిపారు. ఈ పరిశీలనలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Next Story