- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన బీఎల్ఓ..
ఆర్మూర్‌లో అంగన్‌వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్న శోభ, ఎస్‌ఐఆర్‌లో బీఎల్ఓగా విధులు నిర్వహిస్తూ గురువారం ఒత్తిడికి లోనై అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైంది.

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్‌లో అంగన్‌వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్న శోభ, ఎస్‌ఐఆర్‌లో బీఎల్ఓగా విధులు నిర్వహిస్తూ గురువారం ఒత్తిడికి లోనై అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైంది. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని 32వ వార్డులో అంగన్‌వాడీ కార్యకర్తగా శోభ విధులు నిర్వహిస్తోంది. ఎస్‌ఐఆర్‌లో బీఎల్ఓగా విధులు నిర్వహిస్తూ ఒత్తిడికిలోనై గురువారం స్పృహ తప్పి కింద పడిపోయింది. వార్డులో ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించేందుకు ఇంటింటికీ తిరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శోభ స్పృహ తప్పికింద పడిపోవడంతో కాలనీవాసులు వెంటనే ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఎల్ఓ శోభను బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, స్థానిక కౌన్సిలర్ పాన్ శ్రీనివాస్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు ఎస్‌ఐఆర్ కోసం బీఎల్ఓలపై ఒత్తిడి తీసుకురావడంతో వారు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని తెలిపారు. బీఎల్ఓలు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తుండటంతో ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు బీఎల్ఓల పై ఒత్తిడి తేవద్దని విజ్ఞప్తి చేశారు. అధిక ఒత్తిడి కారణంగా ఎక్కువ శ్రమపడుతూ బీఎల్ఓలు అస్వస్థతకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.






