దారి దోపిడికి పాల్పడుతున్న దొంగ అరెస్ట్

by Taduka Kalyani |   (  Updated:2026-07-16 15:35:45  IST  )

ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేసే డబాయ్‌పై అర్ధరాత్రి దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ రమేష్ నాయుడు తెలిపారు.

దారి దోపిడికి పాల్పడుతున్న దొంగ అరెస్ట్
X

దిశ,శేరిలింగంపల్లి : ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేసే డబాయ్‌పై అర్ధరాత్రి దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ రమేష్ నాయుడు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో గోపాల్‌రావు నగర్ రోడ్ నెం.18 వద్ద దాడి చేసి డెలివరీ బాయ్‌ను చంపేస్తామని బెదిరించి, బలవంతంగా మొబైల్ అన్‌లాక్ చేయించి ఆన్‌లైన్ ద్వారా రూ. 900 ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. బాధితుడి జేబులో ఉన్న రూ. 5,000 నగదును కూడా గుంజుకుని స్కూటర్‌పై డెలాయిటి దొంగలు పరారయ్యారు. మియాపూర్ పోలీసుల దారిదోపిడికి పాల్పడే బసోడి అభిషేక్ ను అరెస్ట్ చేయగా మరో నిందితుడి పరారీలో ఉన్నాడు..పట్టుబడిన అభిషేక్‌పై గతంలోనే మధురానగర్, మియాపూర్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లలో పలు దోపిడీ కేసులు నమోదయ్యాయి. ఇతనిపై రౌడీషీట్ ఉంది.సులభంగా డబ్బు సంపాదించడం కోసం రాత్రి వేళల్లో ఒంటరిగా తిరిగే వారిని టార్గెట్ చేసి, దాడి చేసి దోచుకోవడం ఈ ముఠా నైజం. నిందితుడి వద్ద నుంచి రూ. 400 నగదు స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు రమేష్ నాయుడు తెలిపారు.

Next Story