- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదం... కానిస్టేబుల్ మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
పెదవేగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పెదవేగి మండలం నాగన్నగూడెం వద్ద ఆటో, రెండు మోటార్ బైక్‌లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి...

దిశ, పెదవేగి: పెదవేగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పెదవేగి మండలం నాగన్నగూడెం వద్ద ఆటో, రెండు మోటార్ బైక్‌లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏలూరు నుంచి పెదవేగి జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు బైక్‌పై వెళ్తున్న ప్రసాద్ రెడ్డి అనే కానిస్టేబుల్ స్పాట్‌లో మరణించారు. ఆయన ట్రైనింగ్ సెంటర్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నారు.
ఈ ఘటనలో మరో బైకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న మరో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ,గాయపడ్డ వారిని స్థానికులు ఏలూరు తరలించారు, ఆటోలో ప్రయశ్నిస్తున్న వారంతా నర్సీపట్నం ప్రాంతానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. రాట్నాలమ్మ గుడికి వెళ్లి దర్శనం చేసుకుని పెదవేగిలో ఉన్న సాయి బాబా స్థూపాన్ని దర్శించి ఆటోలో ఏడవమైలు మీదగా ఏలూరు వస్తుండగా పెదవేగి మండలం నాగన్న గూడెం సమీపం లో ఆటో ముందు చక్రం గాలి తగ్గి అదుపు తప్పి ఏలూరు నుండి ఏడవమైలు వైపు వస్తున్న ద్విచక్రవాహనాలను ఢీకొన్నట్టు స్థానికులు చెప్పారు. సమాచారం తెలుసుకున్న పెదవేగి ఎస్ఐ హరిగోపాల్ తదితర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద కారణాలను పరిశీలిస్తున్నారు.






