మద్యం మత్తులో పేరెంట్స్‌కు చుక్కలు చూపించిన కొడుకు.. చివరకు..

by S Gopi |

దిశ, జగిత్యాల టౌన్: జిల్లా కేంద్రంలో గల అమీనాబాద్ కి చెందిన..Police counseling a drunken teenager

మద్యం మత్తులో పేరెంట్స్‌కు చుక్కలు చూపించిన కొడుకు.. చివరకు..
X

దిశ, జగిత్యాల టౌన్: జిల్లా కేంద్రంలో గల అమీనాబాద్ కి చెందిన మహమ్మద్ అరీఫ్ అనే యువకుడు తాగిన మైకంలో తల్లిదండ్రులపై తరచూ గొడవకు దిగుతూ ఉండేవాడు. ఎన్నోసార్లు ఇలాగే భరిచించి విసుగుచెందిన పేరెంట్స్ చివరకు అతడిని తాళ్లతో కట్టేసి పట్టణ సీఐ కిశోర్ ని సంప్రదించి పోలీస్ స్టేషన్ కి తరలించారు. తాళ్లతో కట్టి ఉంచిన అరీఫ్ తో ఎస్ఐ సునీల్ మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చారు. తాళ్లతో ఉన్న అరీఫ్ ని కట్లు విడిపించి తీసుకెళ్లి కుటుంబ సభ్యులతో మంచిగా మెలగాలని కౌన్సెలింగ్ ఇచ్చారు. అంతే కాదు.. తను మారితే తామే ఓ మంచి ఉద్యోగం చూస్తామని బంపరాఫర్ ఇచ్చారు.

Next Story