- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ విజేతలను అభినందించిన పోలీసులు
కరాటే పోటీల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడం అభినందనీయమని కోదాడ పట్టణ సీఐ శివశంకర్ నాయక్ అన్నారు.

దిశ, కోదాడ : కరాటే పోటీల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడం అభినందనీయమని కోదాడ పట్టణ సీఐ శివశంకర్ నాయక్ అన్నారు. బుధవారం పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఏప్రిల్ 26న నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కరాటే పోటీల్లో పాల్గొని అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రపంచ వేదిక పై కోదాడ పేరును మారుమోగించిన కరాటే మాస్టర్ కొండపల్లి క్రాంతి కుమార్, ఆయన శిక్షణలోని విద్యార్థులను సీఐ శివశంకర్, ఎస్ఐలు అభినందించి సన్మానించారు.
అనంతరం సీఐ శివశంకర్ మాట్లాడుతూ కఠోర సాధన, నిరంతర శ్రమతోనే ఇలాంటి అంతర్జాతీయ విజయాలు సాధ్యమవుతాయన్నారు. కరాటే వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని, ఈ విజయం స్థానిక యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ముఖ్యంగా ఆత్మరక్షణకు ప్రతిఒక్కరూ కరాటే నేర్చుకోవాలని సూచించారు. కోదాడ చరిత్రలో ఈ గిన్నిస్ రికార్డ్ సాధన ఒక చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు కుసుమ ఉపేందర్ రెడ్డి, అజయ్ కుమార్, మల్సూర్, విజేతలైన విద్యార్థులు పొక్కుల ప్రణీత్, పొక్కుల రక్షిత్, శీలం వరుణ్, కంకిపాటి ఉదితి, తిరగమల్ల వేదశ్రీ నిత్య, మోకా అక్షయ, మోకా అక్షిత, వేముల కరుణ్ కుమార్, తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






