- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమ్రాబాద్ అడవుల్లో అలజడి.. మావోయిస్టులకు షెల్టర్ ఇచ్చిన ఐదుగురు అరెస్ట్
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో జరిగిన పోలీసుల సోధాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో జరిగిన పోలీసుల సోధాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యులకు ఆశ్రయం కల్పించారనే పక్కా సమాచారంతో, ప్రజా సంఘాల నాయకులైన అడ్ల అంబయ్య, జక్కా బాలయ్య ఇళ్లలో పోలీసులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ పర్యవేక్షణలోనే మావోయిస్టులకు ఇక్కడ షెల్టర్ లభించిందన్న కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. ఈ సోదాలు స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించాయి.
ఈ ఆపరేషన్‌లో DKSZC సెక్రెటరీ సల్మాన్, ఆయన భార్య సుకుమాలను పోలీసులు అరెస్ట్ చేయడం ఒక పెద్ద విజయంగా భావిస్తున్నారు. వీరితో పాటు ఐదుగురు అనుమానితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అమ్రాబాద్ అడవులను కేంద్రంగా చేసుకుని మావోయిస్టు కార్యకలాపాలను తిరిగి పుంజుకునేలా చేసే కుట్రలను భగ్నం చేసేందుకు ఈ భారీ సోదాలు, అరెస్టులు జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ అరెస్టులకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి రావాల్సి ఉంది.






