- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సింగరేణి ఆస్పత్రిలో ఉద్రిక్తత.. ఏకంగా మార్చురీ తాళం పగలకొట్టడానికి యత్నం..!
by Satheesh |
దిశ, గోదావరిఖని: పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ఉద్రిక్త పరిస్థితులు- latest Telugu news

X
దిశ, గోదావరిఖని: పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏఎల్‌పీ గనిలో మృతి చెందిన కాంట్రాక్టు కార్మికుడు శ్రీకాంత్ కుటుంబానికి న్యాయం చేయాలని ఆస్పత్రిలో మార్చురీ గది ముందు కార్మిక సంఘాల నాయకులతో పాటు.. మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. మృతదేహంతో బూతు గని వద్దకు వెళ్లి ధర్నా చేయడానికి మార్చురీ తాళం పగలకొట్టడానికి మృతుని బంధువులు వెళ్లగా.. స్థానిక పోలీసులకు వారికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ క్రమంలోనే పోలీసులకు మృతిని బంధువులకు మధ్య తోపులాట జరిగింది. యాజమాన్యం దిగి రాకపోవడంపై బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story






