పోలీసుల అలర్ట్.. ఎమ్మెల్యే, ఎంపీల వాహనాలు తనిఖీలు !

by Disha Web Desk |
పోలీసుల అలర్ట్.. ఎమ్మెల్యే, ఎంపీల వాహనాలు తనిఖీలు !
X

దిశ, డైనమిక్ బ్యూరో : జూబ్లీహిల్స్‌లో ఎమ్మెల్యే షకిల్ కారు ప్రమాదంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. అనధికారికంగా వీఐపీలమంటూ రోడ్డెక్కుతున్న వాహనాలను గుర్తించేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఎమ్మెల్యే స్టిక్కర్‌లతో, బ్లాక్ ఫ్లేమ్ గ్లాస్‌తో రోడ్డుపై తిరిగే వాహనాలను గుర్తించి, అనుమతులు లేని వారిపై చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ సీపీ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, నెంబర్ ట్యాంపరింగ్ చేసేవారిపై కూడా కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

సీపీ ఆదేశాలతో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేయనున్నారు. అయితే, నగరంలో ఎమ్మెల్యే, ఎంపీ స్టిక్కర్లతో వందల వామనాలు కనిపిస్తుంటాయి. కారులో ఎమ్మెల్యే లేకపోయినా సైరన్లు వాడుతూ ట్రాఫిక్‌లో వాహనదారులకు ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు పలుమార్లు ట్విట్టర్ వేదికగా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.


Next Story