- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొక్కలు నాటేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్న పోడు రైతులు.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం
కొమురం భీం ఆసిఫాబాద్ కెరమెరి మండలంలో మళ్లీ పోడు వివాదం రగిలింది.

దిశ, ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ కెరమెరి మండలంలో మళ్లీ పోడు వివాదం రగిలింది. మంగళవారం కెరమెరి మండలంలోని సూద్రపూర్ గ్రామ శివారులోని మొక్కలు నాటేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారుల వాహనాలను రైతులు అడ్డుకున్నారు. దీంతో ఫారెస్ట్ అధికారులు పోడు రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఘటన స్థలానికి భారీగా పోలీసులు రావడంతో కాసేపు ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. గత 40 ఏళ్ల నుంచి ఈ భూములను సాగు చేసుకుంటూ.. తాము జీవనం సాగిస్తున్నామని, ఎలాంటి ముందుస్తు నోటీసులు సమాచారం ఇవ్వకుండా ఇప్పుడు ఖరీఫ్ సీజన్ సాగు ఇచ్చి తమను ఫారెస్ట్ అధికారులు ఈ విధంగా ఇబ్బందులకు గురి చేయడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నేళ్ల నుంచి సాగు చేస్తున్న మా భూములను ఇప్పుడు లాక్కుంటే.. ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు పోలీసులు తమను అరెస్టు చేసి కేసు పెట్టిన చంపిన వెనక్కి తగ్గేది లేదని పోడు రైతులు చెబుతున్నారు.






