మమతా బెనర్జీకి దయాదాక్షిణ్యాలు ఉండవ్: రెచ్చిపోయిన ప్రధాని మోడీ

by Gantepaka Srikanth |

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రధాని మోడీ సీరియస్ కామెంట్స్ చేశారు.

మమతా బెనర్జీకి దయాదాక్షిణ్యాలు ఉండవ్: రెచ్చిపోయిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi) పశ్చిమబెంగాల్(West Bengal)లో పర్యటించారు. హౌరా-గౌహతి మధ్య నడిచే తొలి వందేభారత్ స్లీపర్ ట్రైన్‌ను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) అభివృద్ధి నిరోధకురాలు అని విమర్శించారు. బెంగాల్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బెంగాల్ ప్రజలను నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు. టీఎంసీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. పేదలు అంటే మమతా బెనర్జీకి దయాదాక్షిణ్యాలు లేవు అని రెచ్చిపోయారు. పేద రైతులను గాలికి వదిలేశారని అన్నారు. ఇదిలా ఉంటే.. మోడ్రన్ ఇండియాలో పెరుగుతున్న రవాణా అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక ఫీచర్లతో వందే భారత్ స్లీపర్ రైలును డిజైన్ చేశారు. 16 బోగీలు, 823 మంది ప్రయాణికులతో సుమారు 180 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణిస్తుంది. ఇందులో అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. వేగం, సురక్షితం, మరిన్ని సదుపాయాలతో సుదూర ప్రయాణాలను సాగించనుంది. ఈ రైలుతో హౌరా-గువాహటి(కామాఖ్య) మార్గంలో సుమారు 2.5 గంటల ప్రయాణ సమయం తగ్గుతుంది.

Next Story