- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నోసార్లు ప్రాధేయపడ్డా.. ఏనాడూ నన్ను కాంగ్రెస్ పట్టించుకోలేదు: ప్రధాని మోడీ
రాజ్యసభలో ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాజ్యసభలో ప్రధాని మోడీ(PM Modi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలను అవమానించడం కాంగ్రెస్‌కు అలవాటే.. అది వాళ్ల డీఎన్‌ఏలోనే ఉందన్నారు. గతంలో రాష్ట్రపతిని అవమానించారు.. ఇక నన్నైతే 25 ఏళ్లుగా అవమానిస్తూనే వస్తున్నారని అన్నారు. రాష్ట్రపతిని అవమానించడమంటే.. మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థనే అవమానించినట్లని తెలిపారు. నేను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు అభివృద్ధి విషయంలో, నిధుల విషయంలో ఎన్నోసార్లు కాంగ్రెస్ పెద్దల వద్ద ఆనాడు ప్రాధేయపడ్డాను.. ఏనాడూ, ఎవరూ కనికరించలేదు.. కనీసం లెక్క కూడా చేయలేదని గుర్తుచేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యేదని అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు.. ప్రకటనలు తక్కువ.. అమలు చేసేవి ఎక్కువ అని చెప్పుకొచ్చారు.
వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేదు
కాంగ్రెస్ హయాంలో జనాభాను సమస్యగా భావించారు. నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో 35 కోట్ల జనాభా ఉండేది. అనాడే జనాభాను సమస్యగా భావించారు. నేను మాత్రం 140 కోట్ల జనాభాను సమస్యగా భావించను.. పరిష్కారకర్తలుగా భావిస్తానని ప్రధాని మోడీ చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వంలో దేశం సరైన మార్గంలో వేగంగా పురోగమిస్తోంది. యూపీఏ హయాంలో భారత్ 11వ ఆర్థిక వ్యవస్థగా ఉంటే.. ఎన్డీయే హయాంలో మూడో స్థానానికి చేరుకోనుంది. ప్రపంచంలో భారత్ పరపతి పెరుగుతోంది. గతంలో మనతో ఒప్పందాలకు ఏ దేశం ముందుకొచ్చేది కాదు.. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. భారత్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేదు. వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. అమెరికాతో ట్రేడ్ డీల్ తర్వాత భారత్‌కు మరింత బలం పెరుగుతుంది. మన యువతకు ఎక్కువ లబ్ధి జరగనుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.






