- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నీకు నువ్వు చక్రవర్తి అనుకుంటున్నావా?’.. రాహుల్‌పై మోడీ ఫైర్
విపక్ష పార్టీ ఎంపీలపై ప్రధాని మోడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: విపక్ష పార్టీ ఎంపీలపై ప్రధాని మోడీ(PM Modi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం రాజ్యసభ(Rajya Sabha)లో మోడీ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ తనను తాను చక్రవర్తి అనుకుంటున్నారని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థపై విపక్ష నేతల్లో ఒక్కరికి కూడా అవగాహన లేదని ఎద్దేవా చేశారు. రాజ్యసభలో చర్చ జరిగేటప్పుడు సభ్యులంతా ఎంతో హుందాగా ఉండాలి. కానీ విపక్ష ఎంపీలు మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించారు. చాలా అనుచితంగా ప్రవర్తించారని మోడీ సీరియస్ అయ్యారు.
ఈయూతో చారిత్రక ట్రేడ్ డీల్
బెంగాల్‌లో చొరబాట్లను ప్రొత్సహిస్తున్నారు. బెంగాల్ ప్రజల హక్కులను సీఎం మమతా బెనర్జీ హరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలన్నీ వలసదారులను తరిమివేస్తున్నాయి. కానీ మన దేశంలో మాత్రం అక్రమ వలసదారులను రక్షించాలని అంటున్నారని మోడీ అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆప్ నేతలు లిక్కర్ కుంభకోణాలకు పాల్పడ్డారు. దేశంలో కాంగ్రెస్ అనేక తప్పులు, కుంభకోణాలు చేసింది. కాంగ్రెస్ చేసిన తప్పులు సరిదిద్దడానికి మాకు చాలా సమయం పట్టింది. దేశ అభివృద్ధిని ఏనాడూ కాంగ్రెస్ పట్టించుకోలేదు. ఈయూతో చారిత్రక ట్రేడ్ డీల్ చేసుకున్నాం. అమెరికాతో ట్రేడ్ డీల్ మనకు ఎంతో లాభం. ముఖ్యంగా యువతకు లాభం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని మోడీ చెప్పుకొచ్చారు.
‘కూర్చోండి ఖర్గే గారు’..
ఇదిలా ఉంటే, రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేపై ప్రధాని మోడీ సెటైర్లు వేశారు. ప్రధాని ప్రసంగంగా ప్రారంభం కాగానే విపక్షాలు నినాదాలు ప్రారంభించాయి. ఆ సమయంలో ఖర్గే తన స్థానంలో నిలబడి ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గమనించిన మోడీ.. ‘ఖర్గే ఆయన వయసు దృష్ట్యా కూర్చుని నినాదాలు చేయవచ్చు’ అని సెటైర్ వేశారు.






