పశ్చిమాసియా యుద్ధంపై పార్లమెంటులో ప్రసంగించనున్న ప్రధాని మోడీ.. దేశ భద్రత, ఇంధన వ్యూహాలపై వివరణ

by Malleboina Mahesh |

పశ్చిమాసియా యుద్ధంపై నేడు మధ్యాహ్నం 2 గంటలకు లోక్‌సభలో పీఎం మోదీ ప్రసంగం. ఇంధన భద్రత, భారతీయుల రక్షణపై కీలక ప్రకటన చేసే అవకాశం.

పశ్చిమాసియా యుద్ధంపై పార్లమెంటులో ప్రసంగించనున్న ప్రధాని మోడీ.. దేశ భద్రత, ఇంధన వ్యూహాలపై వివరణ
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో (ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా)మధ్య గత 24 రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. దీంతో వాటి మిద్రదేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోడీ నేడు మధ్యాహ్నం 2 గంటలకు లోక్‌సభలో కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఏర్పడిన ముడి చమురు సంక్షోభం, ఎరువుల కొరత, సరఫరా గొలుసుల (Supply Chain) అంతరాయంపై భారత్ అనుసరిస్తున్న వ్యూహాలను ఆయన సభకు వివరించనున్నారు. ఆదివారం ఆయన 'కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ' (CCS)తో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, యుద్ధం వల్ల సామాన్యులపై భారం పడకుండా ప్రభుత్వం తీసుకుంటున్న స్వల్పకాలిక, దీర్ఘకాలిక పొదుపు చర్యలపై సమీక్షించారు.

ప్రధాని తన ప్రసంగంలో ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న కోటి మందికి పైగా భారతీయుల భద్రత, వారి తరలింపు ప్రణాళికల గురించి మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే 'హార్మూజ్ జలసంధి' దిగ్బంధం వల్ల ఇంధన దిగుమతులకు ఏర్పడిన ఆటంకాలను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఆయన తెలియజేయనున్నారు. ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్ దేశాధినేతలతో మాట్లాడిన మోడీ, చర్చల ద్వారా శాంతిని నెలకొల్పాలని భారత్ కోరుతున్నట్లు స్పష్టం చేయనున్నారు. యుద్ధం వల్ల నిత్యావసర వస్తువుల బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలని ఆయన ఇప్పటికే అధికారులను ఆదేశించారు.

Next Story