రూ. 2,400 కోట్ల నిధులు విడుదల చేసిన ప్రధాని మోడీ

by Malleboina Mahesh |   (  Updated:2026-06-19 13:34:00  IST  )

PM-VBRY పథకం కింద ₹2,400 కోట్ల నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ.. 15 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా ప్రోత్సాహకాలు!

రూ. 2,400 కోట్ల నిధులు విడుదల చేసిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ఢిల్లీ వేదికగా రూ. 2,400 కోట్ల నిధులను విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉపాధి కల్పనను ప్రోత్సహించేందుకు ‘ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’ (PM-VBRY) లబ్ధిదారుల కోసం ₹2,400 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ ఫ్లాగ్‌షిప్ పథకం ద్వారా తొలిసారిగా ఈపీఎఫ్ఓ (EPFO) పరిధిలోకి వచ్చి ఉద్యోగంలో చేరిన యువతకు వన్-టైమ్ ఇన్సెంటివ్‌గా ఒక నెల వేతనం (గరిష్ఠంగా ₹15,000 వరకు) రెండు విడతల్లో నేరుగా వారి ఖాతాల్లోకి అందనుంది. అలాగే, కొత్తగా అదనపు ఉద్యోగాలను సృష్టించే యజమానులకు (Establishments) సైతం ప్రతి కొత్త ఉద్యోగిపై నెలకు ₹3,000 వరకు ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. ఈ చొరవ 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 మధ్య కాలంలో సృష్టించబడే కొత్త ఉద్యోగాలకు వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.

ఈ వినూత్న ఉపాధి అనుసంధాన పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 15 లక్షల మందికి పైగా లబ్ధి చేకూరినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. మొత్తం ₹99,446 కోట్ల బడ్జెట్ కేటాయింపులతో సుమారు 3.5 కోట్లకు పైగా ఉపాధి అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ఈ పథకం నడుస్తోంది. మొదటిసారి ఫార్మల్ రంగంలోకి ప్రవేశించే యువత సాధికారతకు, దేశంలో సామాజిక భద్రతను విస్తరించడానికి ప్రధాని మోడీ చేతుల మీదుగా జరిగిన ఈ నిధుల విడుదల ఒక కీలక మైలురాయిగా నిలవనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story