అసోం గడ్డపై అద్భుతం.. మొరాన్ బైపాస్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీలో దిగిన ప్రధాని మోడీ!

by Malleboina Mahesh |

అసోంలోని డిబ్రూగఢ్‌లో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని ప్రధాని మోదీ సందర్శించారు. ఈశాన్య భారతంలోనే మొదటిదైన ఈ ELFపై యుద్ధ విమానాల విన్యాసాలను ఆయన వీక్షించనున్నారు. రక్షణ రంగంలో ఇది ఒక మైలురాయి.

అసోం గడ్డపై అద్భుతం.. మొరాన్ బైపాస్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీలో దిగిన ప్రధాని మోడీ!
X

దిశ, వెబ్ డెస్క్: అసోం గడ్డపై శనివారం అద్భుతం జరిగింది. ఇటీవల నిర్మించిన మొరాన్ బైపాస్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (Moron Bypass Emergency Landing Facility)లో ప్రధాని మోడీ విమానం (Prime Minister Modi's plane) ల్యాండ్ అయింది. దీంతో ఈశాన్య భారతదేశం (Northeast India) రక్షణ, మౌలిక సదుపాయాల చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. అసోం పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ, డిబ్రూగఢ్‌లోని మొరాన్ బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ELF) పై ల్యాండ్ అయ్యారు. ఈ రకమైన సౌకర్యం ఈశాన్య రాష్ట్రాల్లోనే మొట్టమొదటిది కావడం విశేషం.

గగనతల విన్యాసాల వీక్షణ

ఈ ELF వద్ద ప్రధాని మోదీ భారత వైమానిక దళానికి చెందిన శక్తివంతమైన ఫైటర్ జెట్‌లు, రవాణా విమానాలు, హెలికాప్టర్ల వైమానిక విన్యాసాలను స్వయంగా వీక్షించారు. దేశ రక్షణ రంగంలో ఈశాన్య ప్రాంతం ఎంతటి వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగి ఉందో ఈ ప్రదర్శన చాటిచెప్పింది. యుద్ధం, అత్యవసర పరిస్థితుల్లో జాతీయ రహదారులను రన్‌వేలుగా ఎలా మార్చుకోవచ్చో ఈ ఫెసిలిటీ నిరూపిస్తోంది.

ఈశాన్యంలో సరికొత్త అధ్యాయం

భారతదేశంలో గతంలో రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మాత్రమే ఇలాంటి ELFలు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు అసోంలో దీన్ని ప్రారంభించడం ద్వారా చైనా సరిహద్దులకు చేరువలో ఉన్న మన వైమానిక సామర్థ్యాన్ని కేంద్రం మరింత బలోపేతం చేసింది. రవాణా సౌకర్యాలకే కాకుండా, అత్యవసర సమయాల్లో యుద్ధ విమానాల ల్యాండింగ్‌కు ఇది కీలక కేంద్రంగా మారుతుంది.

Next Story