సబర్మతి తీరంలో రంగుల హేల.. జర్మనీ ఛాన్సలర్‌తో కలిసి ప్రధాని మోడీ పతంగి సందడి

by Malleboina Mahesh |

అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్‌ హాజరయ్యారు.

సబర్మతి తీరంలో రంగుల హేల.. జర్మనీ ఛాన్సలర్‌తో కలిసి ప్రధాని మోడీ పతంగి సందడి
X

దిశ, వెబ్ డెస్క్: అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవాలు (International Kite Festivals) ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi)తో పాటు జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్‌ (Friedrich Merz) హాజరయ్యారు. ఈ సందర్భంగా గుజరాతీలు సంప్రదాయబద్ధంగా వారికి ఘన స్వాగతం పలికారు. గుజరాత్ కళాకారుల సంగీత ప్రదర్శనలు, జానపద నృత్యాలతో సబర్మతి తీరం (Sabarmati Riverfront) కోలాహలంగా మారింది. స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా జరిగిన ఈ సాంస్కృతిక కార్యక్రమాలను ఇరువురు నేతలు ఆసక్తిగా తిలకించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్‌తో కలిసి గాలిపటాలను ఎగురవేయడం ఈ పండుగలో ప్రధాన ఆకర్షణగా ఘట్టంగా నిలిచింది. ఆకాశం నిండా రంగురంగుల పతంగులు రెపరెపలాడుతుండగా, ఇరువురు నేతలు ఉత్సాహంగా దారాలను పట్టుకుని పతంగులను ఎగురవేస్తూ సందడి చేశారు. భారతీయ పండుగ వాతావరణాన్ని జర్మనీ ఛాన్సలర్ ఆస్వాదించగా, ప్రధాని మోడీ ఆయనకు ఈ పండుగ విశిష్టతను వివరించారు. ఈ దృశ్యాలు ఇండో-జర్మన్ మైత్రిని, సాంస్కృతిక బంధాన్ని మరింత బలపరిచేలా నిలిచాయి.

Next Story