- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'విక్రమ్-1' విజయంపై ప్రధాని మోడీ హర్షం
స్కైరూట్ ఏరోస్పేస్ టీమ్‌కు ఫోన్ చేసి అభినందించిన ప్రధాని మోదీ.. విక్రమ్-1 విజయం అంతరిక్ష రంగంలో సరికొత్త మైలురాయి అని ప్రశంస.

దిశ, వెబ్ డెస్క్: అంతరిక్ష రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ 'విక్రమ్-1' (Vikram-1) నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లి చరిత్ర సృష్టించింది. తరుణంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పేస్-టెక్ స్టార్టప్ 'స్కైరూట్ ఏరోస్పేస్' (Skyroot Aerospace) బృందానికి ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించారు. ఈ ప్రయోగం అద్భుత విజయం సాధించిన అనంతరం ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా మరోసారి స్పందిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ ఘనతపై ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ.. "నేను స్కైరూట్ ఏరోస్పేస్ బృందంతో మాట్లాడాను. విక్రమ్-1 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించినందుకు వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేశాను. భారత అంతరిక్ష ప్రస్థానంలో ఇదొక అత్యంత కీలకమైన మైలురాయి. మన అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగ భాగస్వామ్యం నిరంతరం పెరగడం వల్ల సరికొత్త సరిహద్దులు అన్‌లాక్ అవ్వడమే కాకుండా, నూతన ఆవిష్కరణలు మరింత వేగవంతం అవుతున్నాయి. ఈ చారిత్రాత్మక విజయం దేశంలోని లెక్కలేనంత మంది యువత పెద్ద కలలు కనేలా, ఎటువంటి భయం లేకుండా సరికొత్త ఆవిష్కరణలు చేసేలా గొప్పగా ప్రోత్సహిస్తుంది" అని ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు.






