- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విహారయాత్రలో విషాదం.. ట్యాంకర్‌ను ఓవర్ టేక్ చేయబోయి ముగ్గురు మృతి
ఊటీ విహారయాత్ర తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తమిళనాడులోని చెంగపల్లి సమీపంలో శనివారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: ఊటీ విహారయాత్ర తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తమిళనాడులోని చెంగపల్లి సమీపంలో శనివారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సేలం - కోయంబత్తూరు జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారు.. రోడ్డుపక్కన ఆపి ఉన్న గ్యాస్ ట్యాంకర్ లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను తిరుత్తణికి చెందిన విజయ్ (30), అతని భార్య తేన్మొళి (26), కుమార్ (36)లుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఊటీ విహారయాత్రలో విషాదం..
పోలీసుల కథనం ప్రకారం.. తిరుత్తణికి చెందిన నలుగురు పురుషులు, నలుగురు మహిళలు కారులో ప్రసిద్ధ హిల్ స్టేషన్ ఊటీకి విహారయాత్రకు బయలుదేరారు. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న సమయంలో, ముందు వెళ్తున్న ట్యాంకర్ లారీని ఓవర్‌టేక్ చేయడానికి కారు డ్రైవర్ ప్రయత్నించాడు. అయితే ఈ ప్రయత్నం వికటించడంతో, కంట్రోల్ తప్పిన కారు వేగంగా వెళ్లి నిలిపి ఉంచిన గ్యాస్ ట్యాంకర్‌ను వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగానికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పురుషులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాన్ని గమనించిన తోటి వాహనదారులు, అంబులెన్స్ సిబ్బంది వెంటనే స్పందించి, వాహనంలో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను బయటకు తీశారు.
క్షతగాత్రుల పరిస్థితి విషమం..
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని అత్యవసర చికిత్స నిమిత్తం ఉతుకులి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకునే సరికి తేన్మొళి అనే మహిళ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం మరో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరో ముగ్గురు తిరుపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల దేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం పెరుందురై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఉతుకులి పోలీసులు కేసు నమోదు చేసి.. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.






