ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం

by Ratna Kumari |

సూర్యాపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల హాస్టల్‌లో భోజనం చేసిన 13 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా, ఆస్పత్రికి తరలించారు.

ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం
X

దిశ, సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. కళాశాల హాస్టల్‌లో భోజనం చేసిన అనంతరం 13 మంది బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించడంతో కళాశాల యాజమాన్యం వెంటనే అప్రమత్తమైంది. బాధితులను చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు విద్యార్థినులకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనకు హాస్టల్‌లో అందించిన ఆహారమే కారణమా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. ఆహార నమూనాలను సేకరించి పరీక్షలకు పంపే అవకాశమున్నట్లు సమాచారం. ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో చోటుచేసుకున్న ఈ ఘటన విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగించింది. అధికారులు ఘటనకు గల పూర్తి కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Next Story