‘అమ్మా.. ఉద్యోగం ఇప్పించమ్మా!’.. జోగులాంబ అమ్మవారి హుండీలో షాకింగ్ లేఖ

by Jakkula.Mamatha |

సాధారణంగా ఆలయ హుండీల్లో కానుకలు, మొక్కుబడుల చీటీలు కనిపిస్తాయి. కానీ, అలంపూర్ జోగులాంబ అమ్మవారి హుండీలో మాత్రం ఏకంగా ఒక 'బయోడేటా' ప్రత్యక్షమైంది.

‘అమ్మా.. ఉద్యోగం ఇప్పించమ్మా!’.. జోగులాంబ అమ్మవారి హుండీలో షాకింగ్ లేఖ
X

దిశ, అలంపూర్/అలంపూర్ రూరల్: సాధారణంగా ఆలయ హుండీల్లో కానుకలు, మొక్కుబడుల చీటీలు కనిపిస్తాయి. కానీ, అలంపూర్ జోగులాంబ అమ్మవారి హుండీలో మాత్రం ఏకంగా ఒక 'బయోడేటా' ప్రత్యక్షమైంది. అందులో "అమ్మా జోగులాంబ.. టెన్త్ నుంచి B.Ed వరకు ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నా. ఏళ్ల తరబడి ప్రిపేర్ అయినా ఉద్యోగం రావడం లేదు. ఈ సారి నువ్వే నాకు జాబ్ ఇప్పించాలి తల్లీ!" అని రాసి ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

​ఆలయ హుండీ లెక్కింపు సందర్భంగా వెలుగుచూసిన ఈ విచిత్ర లేఖ ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పదో తరగతి నుండి B.Ed వరకు ప్రతి దాంట్లో 80% పైగా మార్కులు సాధించినట్లు తన బయోడేటా ప్రతీకను లేఖకు జత చేశాడు ఆ భక్తుడు. ఎంత కష్టపడి చదివినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోతున్నానని, ఇక నీవే దిక్కంటూ అమ్మవారిని వేడుకున్నాడు. అంతేకాదమ్మ తన దాంపత్య జీవితంలో ఎలాంటి గొడవలు లేకుండా, ప్రశాంతత ప్రసాదించాలని కూడా కోరుకున్నాడు. ఒకవైపు ఉద్యోగం రావాలని.. మరోవైపు జీవన చక్రం సాఫీగా సాగాలని కోరుకోవడం విశేషంగా ఆకట్టుకుంది.

Next Story