- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రయాగ్‌రాజ్‌లో చెరువులో కుప్పకూలిన విమానం
గాలిలో ఎగరాల్సిన విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ లో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: గాలిలో ఎగరాల్సిన విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ (Prayagraj) లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రయాగ్‌రాజ్ నగర మధ్యలో ఉన్న కేపీ కాలేజీ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. గాలిలో ఎగురుతున్న ఆర్మీ శిక్షణ విమానం (Army training aircraft) అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి పెద్ద శబ్దంతో కాలేజీ వెనుక ఉన్న చెరువులో పడిపోయింది. ఈ భారీ శబ్దాన్ని విన్న స్థానికులు, కాలేజీ విద్యార్థులు భయంతో ఘటనా స్థలానికి పరుగులు తీశారు. ఈ విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లతో పాటు మరో వ్యక్తి పారాచూట్ల సహాయంతో కిందకు దూకి ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక దళం, జిల్లా యంత్రాంగం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని (Cordon off) భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆర్మీకి చెందిన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై సైన్యం దర్యాప్తుకు ఆదేశించింది. జనసాంద్రత తక్కువగా ఉన్న చెరువులో విమానం పడటంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు భావిస్తున్నారు.






