కుప్పకూలిన మరో విమానం... శాసనసభ్యునితో సహా 15 మంది మృతి

by Muthe.Rajitha |   (  Updated:2026-01-29 03:50:07  IST  )

విమాన ప్రమాదాలు వెంటాడుతున్నాయి.

కుప్పకూలిన మరో విమానం... శాసనసభ్యునితో సహా 15 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : విమాన ప్రమాదాలు వెంటాడుతున్నాయి. బుధవారం మహారాష్ట్రలో ల్యాండింగ్ సమయంలో ప్రయివేట్ జెట్ కూలిపోయి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా ఐదుగురు మృతి చెందిన సంగతి మరవకముందే.. అలాటిందే మరో ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ విమాన ప్రమాదం కొలంబియాలో జరిగింది. టేకాఫ్ అయిన విమానం కొద్ది నిముషాల్లోనే కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న ఆ దేశ శాసనసభ్యుడు డియోజీనెస్ క్వింటరోతో సహా 15 మంది దుర్మరణం పాలయ్యారు. ఇందులో ఇద్దరు విమాన సిబ్బంది కూడా ఉన్నారు. కుకుటలోని ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన 9 నిముషాల్లోనే కాంటాక్ట్స్ కట్ అయ్యి ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. వెనిజులా సరిహద్దులలోని ఓ మారుమూల ప్రాంతంలో ఈ విమానం కూలిపోయిందని, రెస్క్యూ టీమ్ చేరుకునేలోపే అంతా కాలి బూడిదయ్యారని పేర్కొన్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు.

Similar News : ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం

Next Story