ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-29 03:48:25  IST  )

విమాన ప్ర‌మాదాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. బుధ‌వారం మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ ప్లేన్ క్రాష్ కార‌ణంగా మ‌ర‌ణించారు. సాంకేతిక కార‌ణాల వ‌ల్లే ఈ ప్ర‌మాదం జరిగింద‌ని అధికారులు చెబుతున్నారు.

ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: విమాన ప్ర‌మాదాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. బుధ‌వారం మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ ప్లేన్ క్రాష్ కార‌ణంగా మ‌ర‌ణించారు. సాంకేతిక కార‌ణాల వ‌ల్లే ఈ ప్ర‌మాదం జరిగింద‌ని అధికారులు చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న మ‌ర‌వ‌క‌ముందే కొలంబియాలో విమాన ప్ర‌మాదం జ‌రిగింది. టేకాఫ్ అయిన కొద్దిసేప‌టికే విమానం కుప్ప‌కూలింది. ఈ ప్ర‌మాదంలో మొత్తం 15 మంది మ‌ర‌ణించగా అందులో ఓ శాస‌న‌స‌భ్యుడు కూడా ఉన్నారు. కాగా నేడు ఇండిగో విమానానికి ప్ర‌మాదం త‌ప్పింది. గోవా నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వ‌స్తున్న ఇండిగో విమానాన్ని ప‌క్షి ఢీ కొట్టింది. ప‌క్షి ఢీకొట్టిన విష‌యాన్ని పసిగట్టి పైల‌ట్ సుర‌క్షితంగా ల్యాండింగ్ చేశారు. దీంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ప్ర‌మాదం త‌ప్ప‌డంతో ప్ర‌యాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘ‌ట‌న‌పై ఏటీసీ అధికారులు సెక్యురిటీ అధికారుల‌తో త‌నిఖీ చేయిస్తున్నారు.

Similar News : కుప్పకూలిన మరో విమానం... శాసనసభ్యునితో సహా 15 మంది మృతి

Next Story