భాగ్యనగరంలో పెట్రోల్ 'పానిక్'.. బకెట్లు, క్యాన్లతో బంకుల వద్ద క్యూలైన్లు!

by Malleboina Mahesh |   (  Updated:2026-03-25 10:34:21  IST  )

హైదరాబాద్‌లో పెట్రోల్ పానిక్! బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలైన్లు.. క్యాన్లు, బకెట్లతో ఇంధనం కోసం ఎదురుచూపులు. కొరత లేదంటున్న అధికారులు.

భాగ్యనగరంలో పెట్రోల్ పానిక్.. బకెట్లు, క్యాన్లతో బంకుల వద్ద క్యూలైన్లు!
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ (Petrol, diesel) దొరుకుతుందా అనే చర్చ కొనసాగుతోంది. సోషల్ మీడియాలో వదంతులు, పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు (No stock boards) పెట్టడంతో.. ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల కారణంగా ఉద్యోగస్తులు, సామాన్యులు ఆందోళనకు గురై 'పానిక్ బయ్యింగ్' ('Panic buying') ప్రారంభించారు. దీంతో నగరంలోని వందలాది పెట్రోల్ బంకుల వద్ద ఎప్పుడూ చూడని విధంగా భారీ క్యూలైన్లు (Huge queues) దర్శనమిస్తున్నాయి. వాహనదారులు తమ వాహనాలతోనే కాకుండా, ప్లాస్టిక్ క్యాన్లు, బాటిళ్లు, చివరికి స్టీల్ బకెట్లతో బంకులకు చేరుకుంటున్నారు. పెట్రోల్ కొరత (Shortage of petrol) ఏర్పడుతుందేమో అన్న భయంతో అర్ధరాత్రి వేళ కూడా నిద్ర మానుకొని గంటల తరబడి లైన్లో వేచి ఉంటున్న ఫొటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అలాగే తాజా పరిస్థితులతో బంకుల వద్ద రద్దీ పెరగడంతో పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు యాజమాన్యాలు పోలీసుల సాయం కోరుతున్నాయి. పెట్రోల్ కొట్టించుకునే క్రమంలో అక్కడక్కడ వాహనదారుల మధ్య వాగ్వాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కొందరు వ్యక్తులు ఏకంగా పెద్ద పెద్ద డబ్బాల్లో ఇంధనాన్ని నింపుకొని పోతున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

మరోవైపు, ఇంధన కొరత (Fuel shortage)పై ప్రభుత్వం, ఆయిల్ కంపెనీల అధికారులు స్పష్టత ఇచ్చారు. మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ఆయిల్ కంపెనీల వద్ద సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని వారు ప్రకటించారు. ప్రజలు అనవసరంగా భయాందోళనకు గురై పానిక్ బయ్యింగ్ చేయవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయినప్పటికీ, ప్రజల్లో నెలకొన్న సందేహాల కారణంగా బంకుల వద్ద రద్దీ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా నగరంలోని ఏ బంకులో చూసిన ప్రస్తుతం ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

వరుసగా వస్తున్న 1500 ట్యాంకర్లు.. ఇంధన కొరత లేదన్న సివిల్ సప్లై కమిషనర్!

Next Story