న్యాయం చేయండి.. టెట్ పేపర్ 1 పై హైకోర్టులో పిటిషన్

by Dishanational2 |
న్యాయం చేయండి.. టెట్ పేపర్ 1 పై హైకోర్టులో పిటిషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: టెట్ పేపర్ 1 విషయంలో డీఎడ్ వారికి అన్యాయం జరుగుతుందని డీఎడ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం టెట్ నోటిఫికేషన్‌లో బీఎడ్ వారికి పేపర్ 1 లో అవకాశం ఇవ్వరాదని డీఎడ్ అభ్యర్థులు హైకోర్ట్‌లో పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డీఎడ్ అభ్యర్థులకే టెట్ పేపర్ 1 ఎస్‌జీటీ పోస్టులకు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు, విద్య హక్కు చట్టం ప్రకారం ప్రాథమిక విద్య బోధన కేవలం డీఎడ్ వారిచే బోధించాలని నిబంధనలు ఉన్నాయని, 2018 జులైలో గెజిట్ జారీ చేస్తూ కుట్ర పూరితంగా బీఎడ్ వారికి టెట్ పేపర్ 1 లో అవకాశం ఇచ్చారని, ఇది విద్య హక్కు చట్టానికే విరుద్దంగా ఉందని ఇటీవల రాజస్థాన్‌లో కూడా బీఎడ్ వారికి టెట్ పేపర్ 1లో అవకాశం ఇస్తే అక్కడ హైకోర్టు జోక్యం చేసుకుని పరీక్ష జరిగాక కూడా బీఎడ్ వారికి అర్హత లేదని బ్రిడ్జి కోర్సు చెల్లవని తీర్పు ఇచ్చినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో కూడా హైకోర్టు జోక్యం చేసుకుని డీఎడ్ అభ్యర్థులను ఆదుకోవాలని కోరారు.


Next Story

Most Viewed