- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పనులు పూర్తయ్యేది ఎప్పుడో ?
మద్నూర్ మండలం సుల్తాన్‌పేట్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల పునర్నిర్మాణ పనులు మూడు సంవత్సరాలు గడిచినా ఇంకా పూర్తి కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దిశ, మద్నూర్ : మద్నూర్ మండలం సుల్తాన్‌పేట్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల పునర్నిర్మాణ పనులు మూడు సంవత్సరాలు గడిచినా ఇంకా పూర్తి కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు మూడు ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ నిర్మాణంలో గోడలు, స్లాబు పనులు మాత్రమే పూర్తయ్యాయి. గిలావ, టైల్స్, రంగులు వేయడం వంటి తుది పనులు చేపట్టకపోవడంతో భవనం అసంపూర్తిగా మిగిలిపోయింది. ప్రస్తుతం నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో గ్రామంలోని చిన్నారులు తాత్కాలికంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువును కొనసాగిస్తున్నారు. గ్రామ శివారులోని గుట్ట పై ఉన్నత పాఠశాల ఉండడంతో చిన్నారులు నిత్యం వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు మంచి సౌకర్యవంతమైన వసతులు ఉన్న చోటనే చదువు చెప్పాలన్నదే మా కోరిక. అధికారులు వెంటనే స్పందించి మిగిలిన పనులు పూర్తిచేస్తే సుల్తాన్‌పేట్ ప్రాథమిక పాఠశాల ఉపయోగకరంగా ఉంటుంది అని గ్రామస్తులు కోరుతున్నారు.






