అవకాశాలు నిల్లు.. బోల్డ్ షో ఫుల్లు.. షర్ట్ బటన్స్ తీసేసి ప్రగ్యా జైస్వాల్ రచ్చ

by Mallepaka Hamsa |

ప్రస్తుతం చేతిలో ఎలాంటి ప్రాజెక్టులు లేకపోవడంతో, ప్రగ్యా జైస్వాల్ తన పూర్తి ఫోకస్‌ను సోషల్ మీడియాపై పెట్టింది. ఇన్‌స్టాగ్రామ్‌లో నిత్యం హాట్ అండ్ బోల్డ్ ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్లకు అస్సలు నిద్ర లేకుండా చేస్తోంది.

అవకాశాలు నిల్లు.. బోల్డ్ షో ఫుల్లు.. షర్ట్ బటన్స్ తీసేసి ప్రగ్యా జైస్వాల్ రచ్చ
X

దిశ, సినిమా: ‘మిర్చిలాంటి కుర్రాడు’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన ప్రగ్యా జైస్వాల్.. ‘కంచె’లో మెగా హీరోతో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాలు చేసినప్పటికీ పెద్దగా కలిసిరాలేదు. కానీ గ్లామర్ పరంగా.. నటనకు బాగానే మార్కులు వచ్చాయని చెప్పాలి. అయితే, 2021లో నటసింహం నందమూరి బాలకృష్ణ సరసన నటించిన ‘అఖండ’ సినిమాతో ప్రగ్యా జైస్వాల్ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ అమ్మడి క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఆ సెంటిమెంట్‌తోనే గత ఏడాది వచ్చిన ‘డాకు మహారాజు’ సినిమాలోనూ, అలాగే రీసెంట్‌గా వచ్చిన ‘అఖండ-2’లోనూ బాలయ్య సరసన నటించి బ్యాక్ టు బ్యాక్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఈ మూవీల మంచి విజయం సాధించినప్పటికీ, ఆ తర్వాత నుండి ప్రగ్యాకు టాలీవుడ్‌లో కొత్త ఆఫర్లు పెద్దగా రాలేదు. దీంతో ఆమె సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది.

ప్రస్తుతం చేతిలో ఎలాంటి ప్రాజెక్టులు లేకపోవడంతో, ప్రగ్యా జైస్వాల్ తన పూర్తి ఫోకస్‌ను సోషల్ మీడియాపై పెట్టింది. ఇన్‌స్టాగ్రామ్‌లో నిత్యం హాట్ అండ్ బోల్డ్ ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్లకు అస్సలు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా.. ప్రగ్యా షేర్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటో షూట్‌లో ఆమె వైట్ కలర్ షర్ట్, క్రీమ్ కలర్ ఇన్నర్.. చిన్న షార్ట్ ధరించి కనిపించింది. అంతేకాకుండా, షర్ట్ బటన్స్ విప్పేసి ఎద అందాలు, థైస్ షో చేస్తూ మత్తెక్కించే కళ్లతో కెమెరాకు క్రేజీ పోజులిచ్చింది. ఇక ఈ హాట్ ఫొటోలను చూసిన కుర్రకారు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అయితే, కొందరు నెటిజన్లు మాత్రం ఈ ఫొటోలపై నెగిటివ్‌గా స్పందిస్తున్నారు. "చేతిలో సినిమాలు లేకపోయేసరికి గ్లామర్ షో ఫుల్‌గా పెంచేసింది. ఇదంతా కొత్త ఛాన్సుల కోసమే చేస్తున్నా.. పాపం ఈమెకు లక్ అస్సలు కలిసిరావడం లేదు" అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story