Blood: మిగతా బ్లడ్ గ్రూప్‌లతో పోల్చుకుంటే వీరు నెమ్మదిగా ముసలోళ్లౌతారు.. ఎందుకంటే?

by Anjali |
Blood: మిగతా బ్లడ్ గ్రూప్‌లతో పోల్చుకుంటే వీరు నెమ్మదిగా ముసలోళ్లౌతారు.. ఎందుకంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: శరీరంలో సరిపడ రక్తం(blood) ఉండాలంటే ఐరన్ అధికంగా ఉండే ఆహారాల్ని తీసుకోవాలని నిపుణులు తరచూ చెబుతుంటారు. వీటతో పాటుగా విటమిన్ సి(Vitamin C), ఫోలేట్ (Folate) ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినండని అంటుంటారు. అలాగే బీట్‌రూట్ జ్యూస్ (Beetroot juice) తాగాలి. ఎండు ద్రాక్షల్ని(Grapes), ఖర్జూరాలు (Dates) తినండి. కానీ ఇనుము శోషణకు అంతరాయం కలిగించే ఆహారాలు, పానీయాలను మాత్రం నివారించండని చెబుతుంటారు.

మన శరీరంలో హిమోగ్లోబిన్ శాతం (Hemoglobin percentage) ఎంత ఉండాలో చూసుకున్నట్లైతే.. మగవారిలో ప్రతి 100 గ్రాముల రక్తంలో సగటున 13 గ్రాములు, ఆడవారిలో 12 గ్రాములు ఉండాలి. ఆరు సంవత్సరంలోపు పిల్లల్లో 11 గ్రాములు, గర్భిణీ స్త్రీల(pregnant women)లో 11 గ్రాములు, బాలింతలలో 12 గ్రాములు ఉండాలి. 6 నుంచి 12 సంవత్సరాల లోపు పిల్లల్లో12 గ్రాములు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే సాధారణంగా బ్లడ్ గ్రూపులు ఎ, బి, ఎబి, ఓ అని ఉంటాయి. ఇందులో ఓ పాజిటివ్, నెగిటివ్ అని ఉంటాయి. ఒక్కో బ్లడ్ గ్రూప్‌కు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మార్పిడి విజయవంతం కావడానికి, గ్రహీత యొక్క దీర్ఘకాలిక ఆరోగ్యానికి బ్లడ్ అనేది చాలా ముఖ్యం. అయితే ఇటీవల చాలా మంది వయస్సు మీద పడకముందే వృద్ధాప్య ఛాయలు (Age spots) కనిపిస్తోన్న విషయం తెలిసిందే.

ఇందుకు కారణాలు అనేకం ఉన్నాయి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం, ప్రస్తుత కాలంలో ఉన్న టెన్షన్స్(tensions), వర్క్ ప్రెసర్(Work pressure).. కారణంగా పిన్న వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతుంటారు. కాగా ఈ సమస్య రాకుండా ఉండాలంటే తాజా పండ్లు కూరగాయలు(Fruits and vegetables), మాంసం, చేపలు(Fish), పాలు, గుడ్లు, వ్యాయామాలు(Exercises), యోగా(Yoga) వంటివి అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు.

కానీ బి బ్లడ్ గ్రూప్ వారు మిగతా గ్రూపులతో పోల్చుకుంటే చాలా ఆలస్యంగా ముసలివారు అవుతారని ఓ సర్వేలో తెలినట్లు తాజాగా నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ బ్లడ్ గ్రూపు వారి రక్తంలో కణాల పునరుత్పత్తి(Cell regeneration), కణజాల మరమ్మత్తులు(Tissue repairs) మెరుగ్గా ఉంటాయట. తద్వారా బి రక్త వర్గం వారు ఏజ్ మీద పడుతోన్న యవ్వనంగా కనిపిస్తుంటారని నిపుణులు వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా వీరికి ఆయుష్షు కూడా ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.

Advertisement
Next Story