- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్యాస్ సరఫరా ప్రజలు గందరగోళ పడవద్దు : మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
గ్యాస్ సరఫరాపై ప్రజలు గందరగోళ పడవద్దని, గ్యాస్ బ్లాక్ చేస్తే ఉపేక్షించేది లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హెచ్చరించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : అమెరికా, ఇరాన్ కు జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొట్టి పారేశారు. ప్రజల్లో లేని పోనీ అపోహలు సృష్టించి వారిని గందరగోళంలో పడేసేలా జరుగుతున్న ప్రచారంపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, పౌర సరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్రలతో కలిసి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సీఎస్ ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో ఎటువంటి గందరగోళానికి గురి కావొద్దని,గృహ వినియోగదారులకు సరిపడా సరఫరా చేస్తామని భరోసా ఇచ్చారు. సామాజిక మాద్యమాల ద్వారా కృత్రిమంగా గ్యాస్ కొరత సృష్టించేందుకు జరుగుతున్న ప్రచారం ప్రజలు నమ్మవద్దన్నారు. గందరగోళం కారణంగా రోజు 72 శాతం బుకింగ్స్ జరుగుతున్నాయని, గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రిలకు,విద్యాసంస్థలకు,వృద్దాశ్రమలకు,ప్రభుత్వ సంస్థలకు ప్రాధన్యత క్రమంలో సరఫరా చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందన్నారు.
రాష్ట్రంలో 810 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా 1.29 కోట్ల కనెక్షన్లు ఉండగా రోజు వారిగా 2.5 లక్షల సిలిండర్ల సరఫరా జరుగుతుందన్నారు.ఇప్పటి వరకు రాష్ట్రంలోనీ బాట్లింగ్ ప్లాంట్లలో గ్యాస్ కొరత ఉన్నట్లు ఎక్కడా నమోదు కాలేదని చెప్పారు. అపోహలను అడ్డుపెట్టుకుని బ్లాక్ చేయాలని చూస్తే ప్రభుత్వం ఎంత మాత్రం ఉపేక్షించదని, కఠినమైన చర్యలకు ఉపక్రమిస్తుందని హెచ్చరించారు. జిల్లాల్లో కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక అధికారుల కమిటీ ఏర్పాటు చేసి రోజువారీ నిల్వలు,సరఫరా పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల కొకసారి ,గ్రామీణ 45 రోజులకు ఒకమారు బుక్ చేసుకోవాలని వినియోగదారులకు సూచించారు. అపోహలను నమ్మి అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేసుకోవొద్దని,గృహా వినియోగ దారులకు సరిపడా గ్యాస సరఫరా చేస్తామని,ప్రభుత్వం దగ్గర ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తుందని వెల్లడించారు.






