బాల్కనీ నుంచి కేకలు వేస్తున్న ప్రజలు.. వీడియో వైరల్

by Dishafeatures2 |
బాల్కనీ నుంచి కేకలు వేస్తున్న ప్రజలు.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: తాజాగా నెట్టింట ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో అనేక మంది ప్రజలు తమతమ అపార్ట్‌మెంట్ బాల్కనీల నుంచి కేకలు వేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. అయితే ఇది చైనాలోని షాంఘై నగరానికి చెందిన వీడియో. కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా చైనా ప్రభుత్వం షాంఘైలో పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను ప్రకటించింది. ఈ లాక్‌డౌన్ మొదలయ్యి వారం రోజులు అవుతుంది. దాంతో ప్రజలు కేకలు వేస్తున్నారు. షాంఘలో కఠిన లాక్‌డౌన్ నియమాలను చైనా ప్రభుత్వం అమలు చేస్తోంది. ఏ ఒక్కరూ రోడ్డుపైకి రాకూడదని, కనీసం అత్యవసరాల కోసం కూడా బయటకు రాకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

దీంతో 26 మిలియన్ల మంది నివసించే షాంఘైలో ప్రజలు ఇలా కేకలు వేస్తూ తమ ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ పోగొట్టుకుంటున్నారని నెట్టింట చర్చ జరుగుతోంది. ఇటీవల అపార్ట్‌మెంట్లలోని వారికి ఓ డ్రోన్ సహాయంతో అత్యావసర వస్తువులు అందిస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది. ఈ వీడియో కింద 'వారి ఆత్మలు స్వేచ్ఛను కోరుకుంటున్నాయి' అంటూ రాసుకొచ్చారు. అయితే ఇది ఒక జంటతో ప్రారంభం అయిందని, ఇప్పుడు నగరమంతా అదే పద్దతిని పాటిస్తోందని అక్కడే నివసిస్తున్న ఓ వ్యక్తి తెలిపారు. అంతేకాకుండా ఇదంతా ఏదో పరిణామానికి దారితీస్తోందని, ఇదెప్పుడు అంతం అవుతుందో అర్థం కావడం లేదని ఆ వ్యక్తి అన్నారు.


Next Story

Most Viewed