- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పది రోజుల్లోగా పెండింగ్ పనులు పూర్తి చేయాలి
చొప్పదండి 100 పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెండింగ్ పనులను పది రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు.

దిశ, చొప్పదండి : చొప్పదండిలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆసుపత్రిలో పెండింగ్ పనులను పది రోజుల్లోగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం చొప్పదండి ఏరియా ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్, కాంట్రాక్టర్, డీజీహెచ్‌ఎస్ కృష్ణప్రసాద్, టీజీఎంఐడీసీ అధికారులతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలిస్తూ విద్యుత్, ఎలక్ట్రికల్ తదితర పెండింగ్ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు.
అనంతరం మండలంలోని రుక్మాపూర్‌లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని, పనులను చిన్న చిన్న భాగాలుగా విభజించి సమయానికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నవీన్ కుమార్, ఎంపీడీవో వేణుగోపాల్, ఈఎన్‌టీఎం బృందం అహ్మద్ హుస్సేన్, టీజీడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






