- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీవన్ రెడ్డి ఆగ్రహం.. పీసీసీ చీఫ్ ఏమన్నారంటే?
కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి తన సొంత పార్టీ తీరును వ్యతిరేకించారు.

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి తన సొంత పార్టీ తీరును వ్యతిరేకించారు. గాంధీభవన్‌లో జరిగిన నిజామాబాద్ పార్లమెంట్ సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పాల్గొనడంపై అసహనం వ్యక్తం చేస్తూ.. సమావేశం మధ్యలోనే బయటికి వెళ్లిపోయారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అయిన సంజయ్‌ను కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. సంజయ్ ఇంకా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నట్టు అఫిడవిట్ ఇచ్చారని గుర్తుచేశారు. వేరే పార్టీ వాళ్ళు ఉంటె తమ పార్టీ అంతర్గత విషయాలు ఎలా చర్చిస్తారని మండిపడ్డారు.
గత పదేళ్లుగా బీఆర్‌ఎస్ అక్రమాలు, దౌర్జన్యాలను ఎదుర్కొన్నామని, అలాంటి పార్టీకి చెందిన ఎమ్మెల్యేను తమ పక్కన కూర్చోబెట్టడం సరైనదేనా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా జీవన్ రెడ్డి అలకపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వివరణ ఇచ్చారు. జీవన్ రెడ్డి ఆవేదనను అర్థం చేసుకున్నామని, అయితే ఆ పార్లమెంట్ పరిధిలో అందరినీ పిలిచినట్టే ఆయన్ని కూడా పిలిచామని పేర్కొన్నారు.






