Payal Rajput: ప్రేమ గురించి పాయల్ ఆసక్తికర పోస్ట్.. అతని గురించి మొదలైన చర్చ

by Mallepaka Hamsa |

యంగ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) ‘ఆర్‌ఎక్స్100’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.

Payal Rajput: ప్రేమ గురించి పాయల్ ఆసక్తికర పోస్ట్.. అతని గురించి మొదలైన చర్చ
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) ‘ఆర్‌ఎక్స్100’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అమ్మడు ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. ఆ తర్వాత వరుస చిత్రాల్లో ఆఫర్లు అందుకుని ప్రేక్షకులను అలరించింది. ఇక గత ఏడాది ‘మంగళవారం’(Mangalavaram) మూవీతో హిట్ అందుకుని ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఏ కొత్త ప్రాజెక్ట్ వెల్లడించలేదు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ హాట్ ఫొటోలు(hot photos), వీడియోలు షేర్ చేస్తోంది.

తాజాగా, ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో ఓ హాట్ వీడియో షేర్ చేసిన ఆమె లవ్ గురించి హిట్ ఇచ్చింది. ‘‘ప్రేమను మీరు ఎలా పలుకుతారు? నేను మాత్రం లవ్‌ను అనుభవిస్తాను’’ అనే క్యాప్షన్ జత చేసింది. దీంతో ఇది చూసిన వారంతా పాయల్ ప్రేమలో పడినట్లు హింట్ ఇచ్చిందని అంటున్నారు. అలాగే ఆ హాట్ బ్యూటీని ప్రేమలో దించిన వ్యక్తి ఎవరంటూ చర్చించుకుంటున్నారు.

Next Story