- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మణికొండలో జనసేన కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్.. భారీగా చేరికలు
హైదరాబాద్ మణికొండలో జనసేన తెలంగాణ నూతన రాష్ట్ర కార్యాలయం ప్రారంభం.. ప్రత్యేక పూజలతో శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేసిన పార్టీ శ్రేణులు!

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మణికొండలో జనసేన కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేక దృష్టిసారించిన ఆయన.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని మణికొండలో జనసేన పార్టీ తెలంగాణ నూతన రాష్ట్ర కార్యాలయాన్ని జనసేనాని పవన్ కల్యాణ్ తన చేతుల మీదుగా అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నాయకులు, పీఏసీ సభ్యులు, భారీ సంఖ్యలో తరలివచ్చిన జనసైనికులు, వీరమహిళలతో మణికొండ ప్రాంతం మొత్తం సందడిగా మారింది.
నూతన కార్యాలయంలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించిన అనంతరం నేతలు గృహప్రవేశం చేశారు. అంతకు ముందు పార్టీ కార్యాలయం ముందు జనసేన జెండాను ఎగురవేసిన పవన్ కల్యాణ్, పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. తెలంగాణలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి, రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన పోరాటాలు, పార్టీ సంస్థాగత కార్యకలాపాలను ముమ్మరం చేయడానికి ఈ నూతన కార్యాలయం ప్రధాన వేదికగా నిలవనుందని పార్టీ శ్రేణులు వెల్లడించారు. సరికొత్త హంగులతో సిద్ధమైన ఈ ఆఫీస్ ప్రారంభోత్సవం తో మణికొండ పరిసర ప్రాంతాల్లో జనసైనికుల కోలాహలం, సందడి నెలకొంది.






