రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారు?.. జనసేన నేతలకు పవన్ కల్యాణ్ క్లాస్

by Gantepaka Srikanth |

జనసేన నేతలపై ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారు?.. జనసేన నేతలకు పవన్ కల్యాణ్ క్లాస్
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన నేతలపై ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మంగళగిరిలో జనసేన పార్టీ సర్వసభ్య సమావేశం (Jana Sena General Body Meeting) జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన పవన్ కల్యాణ్ పార్టీ నేతలకు క్లాస్ ఇచ్చారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసుపై వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నారంటూ మండిపడ్డారు. అలాగే అరవ శ్రీధర్ విషయంలోనూ పవన్ కల్యాణ్ సీరియస్ అయినట్లు తెలిసింది. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ వ్యవహార శైలిని ప్రజలకు వివరించాలని సూచనలు చేశారు. ఇళ్లపై దాడులు, వైసీపీ అరాచక వైఖరిని తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. కష్టపడి పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చాం.. పార్టీని ఇబ్బందులకు గురిచేసే వారిని ఉపేక్షించం.. పార్టీకి చెడ్డపేరు తీసుకొచ్చే వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని కీలక ప్రకటన చేశారు.

దీంతోపాటు ఇటీవల ఆరోపణలు ఎదుర్కొన్న రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంపైనా పవన్ కల్యాణ్ సీరియస్ అయినట్లు తెలిసింది. అందరి చిట్టా తన వద్ద ఉందంటూ వ్యాఖ్యానించినట్లు సమాచారం. విచారణ కమిటీ ఎదుట హాజరై.. వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

Next Story