- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీజీ వైద్య విద్యార్థుల పై పేషెంట్ అటెండర్ దాడి.. ఆందోళనకు దిగిన వైద్యులు
నిలోఫర్ ఆసుపత్రిలో పీజీ వైద్య విద్యార్థుల పై రోగి సహాయకులు చేసిన దాడికి నిరసనగా వైద్య విద్యార్థులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు.

దిశ, కార్వాన్ : నిలోఫర్ ఆసుపత్రిలో పీజీ వైద్య విద్యార్థుల పై రోగి సహాయకులు చేసిన దాడికి నిరసనగా వైద్య విద్యార్థులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. ఈ మేరకు సోమవారం నిలోఫర్ ఆసుపత్రిలో సూపరిండెంటు ఛాంబర్ ముందు పీజీ వైద్య విద్యార్థులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో పీజీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 2 వ తేదీన 6 ఏళ్ల బాలిక ఊపిరితిత్తుల సమస్యతో నిలోఫర్ ఆసుపత్రికి వచ్చింది. వచ్చిన రోజు నుంచి మొదలుకొని ఐసీయూలో బాలిక కుటుంబ సభ్యులు పదుల సంఖ్యలో రావడం వైద్యులను ఇబ్బంది పెట్టడం చేశారు. ఈ విషయం పై ఇది వరకే అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే శనివారం రాత్రి రోగి సహాయకులు పీజీ రెండవ సంవత్సరం వైద్యుడు నందన్, మొదటి సంవత్సరం వైద్యురాలు చందనతో వాగ్వాదానికి దిగి చేయి చేసుకున్నారు.
అంతే కాకుండా ఆసుపత్రిలోని వార్డులో ఉన్న సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ విషయం పై వెంటనే ఎస్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్పీఎఫ్ పోలీసులు వచ్చి డాక్టర్స్ కు కాకుండా దాడికి పాల్పడిన వారికే మద్దత్తు పలకారని ఆరోపించారు. నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికి పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం చొరవ కల్పించుకుని ఇలాంటి దాడులను అరికట్టి డాక్టర్లకు రక్షణ కల్పించాలని, అంతే కాకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని, దాడికి పాల్పడ్డవారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విషయం తెలిసిన వెంటనే నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆసుపత్రి సూపరిండెంట్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ విషయం పై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము, దాడికి పాల్పడ్డ వారిపై విచారణ చేస్తున్నామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఐ ప్రసాద రావు హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా నిరసనను విరమించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విష్ణు టీజీఎంసీ మెంబర్, జూడ సభ్యులు విష్ణు, హేమాంజలి, హర్ష వర్దిని, క్రాంతి తేజ, వీణ, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.






