- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశా: గూడెం మహిపాల్‌రెడ్డి హాట్‌కామెంట్స్
మున్సిపల్ ఎన్నికల వేళ పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల వేళ పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ముఖ్య అనుచరులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. అప్పటి పరిస్థితుల వల్ల కాంగ్రెస్‌లో చేరాల్సి వచ్చింది. చేరినా ఏం లాభం జరుగలేదు. కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశాను. మూడుసార్లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచా. ఇందులోనే ఉండి ఉంటే బాగుండేది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. రేపు జరుగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి అని మహిపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు ఇప్పటికే మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ ముఖ్యనేతలకు టచ్‌లో ఉన్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే తన అనుచరులను ఒక్కొక్కరిని కారెక్కిస్తున్నారని టాక్. త్వరలోనే గూడెం మహిపాల్‌రెడ్డి కూడా గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ ఫిరాయింపుల కేసులో మహిపాల్ రెడ్డికి స్పీకర్ క్లీన్ చీట్ ఇచ్చారు. కానీ ఇంకా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. దీంతో ఏమైనా ఇబ్బందులు వస్తాయా అన్నది తేలాక మహిపాల్ రెడ్డి తిరిగి గులాబీ పార్టీలోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.






