- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రయాణికుల భద్రతే ముఖ్యం.. ఉయ్యూరు ఆర్టీఏ అధికారి చొరవకు మంత్రి లోకేశ్ ఫిదా!
ఉయ్యూరు ఆర్టీఏ అధికారి సిద్దిఖ్ చొరవను ప్రశంసించిన మంత్రి లోకేశ్! బస్సు ప్రమాదాలపై అవగాహన కల్పించిన వీడియోపై లోకేశ్ సానుకూల స్పందన.

దిశ, వెబ్ డెస్క్: మంత్రి నారా లోకేష్.. ఆర్టీఏ అధికారి పై ప్రశంసలు కురిపించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఇటీవల తరచూ చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన ఆర్టీఏ అధికారి సిద్దిఖ్ ప్రయాణికుల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన వినూత్న ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బస్సుల్లో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో ఆయన ప్రయాణికులకు ప్రత్యక్షంగా వివరించారు. ఈ వీడియోపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ సదరు అధికారిని ప్రశంసల్లో ముంచెత్తారు.
ఆర్టీఏ అధికారి సిద్దిఖ్ బస్సులోని ప్రయాణికులతో మాట్లాడుతూ.. ప్రమాదం జరిగినప్పుడు విలువైన వస్తువుల కోసం సమయాన్ని వృథా చేయకుండా, వెంటనే బస్సు నుంచి దిగిపోవాలని సూచించారు. ప్రయాణం ప్రారంభించే ముందే ఎమర్జెన్సీ డోర్ (Emergency Door) ఎక్కడుందో తెలుసుకోవడం ప్రాణాపాయం నుంచి రక్షిస్తుందని వివరించారు. ఈ వీడియోను చూసిన మంత్రి లోకేశ్.. "ప్రయాణికుల భద్రతపై ఈ అధికారి చూపిస్తున్న చొరవ అభినందనీయం. ఇలాంటి చిన్నపాటి జాగ్రత్తలు ఎంతోమంది ప్రాణాలను కాపాడుతాయి" అని పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు ఇలా బాధ్యతాయుతంగా వ్యవహరించడం వల్ల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని ఆయన వెల్లడించారు.






