చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికకు పార్టీల గ్రీన్ సిగ్నల్

by Malleboina Mahesh |

నిర్మల్ సహా పలు మున్సిపాలిటీల్లో పాలకవర్గాలు నేడు కొలువుదీరనున్నాయి. నిర్మల్‌లో ఒకే కుటుంబం నుండి నాలుగోసారి చైర్‌పర్సన్‌గా అప్పాల కావ్య రికార్డు సృష్టించబోతుండగా, ఆదిలాబాద్, బైంసా వంటి చోట్ల పొత్తులు, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ఉత్కంఠ కొనసాగుతోంది. చెన్నూరు, లక్షెట్టిపేటలోనూ స్పష్టమైన మెజారిటీతో కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టనున్నాయి.

చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికకు పార్టీల గ్రీన్ సిగ్నల్
X

దిశ, నిర్మల్ ప్రతినిధి: పురపాలక సంఘాల పాలకవర్గాలు నేడు కొలువుదీరనున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మంచిర్యాల కార్పొరేషన్ సహా నిర్మల్ చెన్నూరు లక్షెట్టిపేట క్యాతన్ పల్లి పురపాలక సంఘాల్లో మాత్రమే స్పష్టమైన మెజారిటీ తో పాలకవర్గాలు కొలువు తీరుతుండగా... మిగిలిన చోట్ల ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చివరి క్షణం దాకా తేలే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో క్యాంపుల్లో సయోధ్య కుదుర్చుకున్న మేరకు ఆయా మున్సిపాలిటీల్లో ఏర్పాటు కానున్న పాలకవర్గాల చైర్మన్లు వైస్ చైర్మన్లు ఎవరో నేరుగా క్యాంపు ల నుండి వస్తున్న కౌన్సిలర్లు ఎన్నికల కేంద్రాల్లోనే తేల్చనున్నారు.

నిర్మల్‌లో ఒకే కుటుంబం నుంచి నాలుగోసారి..

నిర్మల్ పురపాలక సంఘంలో సోమవారం నిర్వహిస్తున్న చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు లాంఛనమే కానున్నాయి చైర్ పర్సన్ గా అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి బాధ్యతలు చేపట్టమన్నారు. స్పష్టమైన మెజారిటీ ఉండడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవంగా జరగనుంది. ఒకే కుటుంబం నుంచి నాలుగో వ్యక్తి చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టబోతున్న వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించనున్నారు అంతకుముందు ఆమె తాత అప్పాల నరసయ్య, ఆమె అత్త అనురాధ మహేష్, ఆమె భర్త గణేష్ చక్రవర్తి గతంలో నిర్మల్ పురపాలక సంఘం చైర్మన్‌గా పని చేశారు. అదే కుటుంబం నుంచి కావ్య గణేష్ చక్రవర్తి నాలుగో చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టబోతుండడం గమనార్హం.

చెన్నూరులో మంత్రి సూచన మేరకు..

చెన్నూరు పురపాలక సంఘంలో చైర్ పర్సన్ గా మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించిన వ్యక్తి ఎంపిక కానున్నారు. పెద్దింటి పద్మ, సుద్దపెల్లి సునీత లలో ఒకరు చైర్పర్సన్ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. లక్సెట్టిపేట మున్సిపల్ చైర్ పర్సన్ గా దొంత అంజలి నరసయ్య ఎన్నికయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.

మిగిలిన చోట్ల చైర్మన్లు ఎవరో..?

ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ పాలకవర్గాలకు చైర్మన్లు ఎవరు ఎంపిక అవుతారో తేలని పరిస్థితి ఉంది. బైంసాలో ఇండిపెండెంట్ లకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఒకవేళ ఎంఐఎం అవకాశం పొందితే జాబీర్ అహ్మద్ మరోసారి చైర్మన్ గా ఎన్నిక కావచ్చు. అయితే ఆయనకు సంపూర్ణ స్థాయిలో కౌన్సిలర్లు మద్దతు దొరకలేదని తెలిసింది. ఆదిలాబాద్ లో బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ బి‌ఆర్ఎస్ కలిసి ఇండిపెండెంట్ అభ్యర్థిని తెరమీదికి తెచ్చినట్లు తెలిసింది అదే జరిగితే బండారి అనూషకు అవకాశం రావచ్చు. బీజేపీ ఆకుల శైలజను బరిలో దింపే అవకాశాలు ఉన్నాయి. ఆసిఫాబాద్ లో కాంగ్రెస్ నుంచి అబ్దుల్లా బిన్ అహ్మద్, భారత్ రాష్ట్ర సమితి నుంచి చిలువేరు వెంకన్నలు పోటీలో ఉన్నారు. ఖానాపూర్ లో బీజేపీ బీఆర్ఎస్ జతకట్టినట్లు తెలుస్తున్నది. బీజేపీ అభ్యర్థికి అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Next Story