- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ షెడ్యూల్ విడుదల చేసింది. రెండు విడతల్లో సమావేశాలన నిర్వహించనున్నారు.

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ (Department of Parliamentary Affairs) షెడ్యూల్ విడుదల చేసింది. రెండు విడతల్లో ఈ సమావేశాలన నిర్వహించనున్నారు. ఈ నెల 28న రాష్ట్రపతి ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి విడత జనవరి 28న ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతుంది. దాదాపు నెల రోజుల విరామం తర్వాత, రెండో విడత సమావేశాలు మార్చి 9న మొదలై ఏప్రిల్ 2న ముగుస్తాయి. సమావేశాల తొలి రోజు జనవరి 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడంతో ఈ సెషన్ ప్రారంభమవుతుంది.
ఆదివారం నాడు బడ్జెట్
ఈ సమావేశాల్లో అత్యంత కీలక ఘట్టమైన కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. విశేషమేమిటంటే.. ఈసారి ఫిబ్రవరి 1 ఆదివారం వచ్చినప్పటికీ, అదే రోజున బడ్జెట్ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశ పెట్టేందుకు నిర్ణయించారు. అంతకుముందు రోజు (జనవరి 31) ఆర్థిక సర్వేను సభ ముందు ఉంచే అవకాశముంది. దేశ ఆర్థిక గతిని నిర్దేశించే ఈ బడ్జెట్‌పై సామాన్యులతో పాటు పారిశ్రామిక వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ ఏదాడి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నా ఐదు రాష్ట్రాల ప్రజలు ఈ బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.






