అధిక ఫీజుల వసూళ్లు.. ప్రజావాణిలో తల్లిదండ్రుల ఫిర్యాదు

by Batti.Sumithra |

చింతలపాలెం మండలంలోని అంజని సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీత మెమోరియల్ స్కూల్‌లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.

అధిక ఫీజుల వసూళ్లు.. ప్రజావాణిలో తల్లిదండ్రుల ఫిర్యాదు
X

దిశ చింతలపాలెం : చింతలపాలెం మండలంలోని అంజని సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీత మెమోరియల్ స్కూల్‌లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఫీజులు పూర్తిగా చెల్లిస్తేనే పుస్తకాలు అందజేస్తామని విద్యార్థులను బెదిరిస్తున్నారని, స్కూల్ ఫీజు, బస్సు ఫీజు, పుస్తకాల ఫీజు, అడ్మిషన్ ఫీజులను భారీగా పెంచి తల్లిదండ్రుల పై అదనపు ఆర్థిక భారం మోపుతున్నారని ఆరోపించారు. స్కూల్ స్థాపన సమయంలో పరిసర గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు అధిక ఫీజుల దోపిడీని అరికట్టి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదును జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులకు పంపించగా, జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) స్పందించి చింతలపాలెం మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ)తో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు మోర్తాల నాగిరెడ్డి, రుద్రపంగు రమేష్, మల్‌రెడ్డి సైదిరెడ్డి పాల్గొన్నారు.

Next Story