- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారి మూర్ఖపు చర్యతో అనాధలుగా మారిన పిల్లలు
దిశ, డైనమిక్ బ్యూరో : అప్పుల బాధలు తట్టుకోలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. చేసిన వ్యాపారంలో తీవ్ర నష్టాలు రావడంతో తమకు ఇక ఆత్మహత్య చేసుకోవడమే

దిశ, డైనమిక్ బ్యూరో : అప్పుల బాధలు తట్టుకోలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. చేసిన వ్యాపారంలో తీవ్ర నష్టాలు రావడంతో తమకు ఇక ఆత్మహత్య చేసుకోవడమే మార్గం అనుకున్నారు. వారి మూర్ఖపు చర్యలకు పిల్లలు అనాధలుగా మారారు. ఈ ఘటన కేరళ కొచ్చిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతులను వెలియిల్ విట్టిల్ గిరిజ (65), గిరిజ కూతురు రజిత (35), అల్లుడు ప్రశాంత్ (40)గా పోలీసులు గుర్తించారు. అయితే వీరు ముగ్గురు పిండి మర వ్యాపారం చేశారని, కానీ అందులో తీవ్రంగా నష్టాలు వచ్చాయని తెలిపారు. దాంతో వారి వద్ద అప్పులు కట్టేందుకు కూడా డబ్బులేదని, దాంతో ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అయితే రజిత పిల్లలు ఉదయం నిద్రలేచి చూసేసరికి తమ తల్లిదండ్రులు మరణించి కనిపించారు. దాంతో వారు పెద్దగా కేకలు వేస్తూ ఏడవడం మొదలు పెట్టారు. దాంతో అక్కడికి చేరుకున్న ఇరుగుపొరుగు వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు.






