ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్న అధికారులు.. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తిన పర్చూరు ఎమ్మెల్యే

by Malleboina Mahesh |

జా సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యంపై పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అసెంబ్లీలో ధ్వజమెత్తారు. ప్రజా విజ్ఞప్తులు పరిష్కారం కాకపోయినా, అయినట్లుగా చూపిస్తూ అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్న అధికారులు.. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తిన పర్చూరు ఎమ్మెల్యే
X

దిశ, ప్రతినిధి బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు నమోదు అవుతున్న ప్రజా విజ్ఞప్తులు, ఫిర్యాదుల పరిష్కారం జరిగినట్లుగా చూపిస్తూ ప్రభుత్వాన్ని అధికారులు తప్పుదారి పట్టిస్తున్నారని, ఈ విషయమై ప్రభుత్వం నిర్దిష్టమైన మార్గదర్శికాలం రూపొందించాలని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో స్పీకర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ.. అధికారులు, ప్రభుత్వం ముందించిన లెక్కలలో అంకెలను పరిశీలిస్తే అధికారుల నిర్లక్ష్యం స్పష్టం అవుతోందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆందోళన వ్యక్తపరిచారు. శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు నమోదు అవుతున్న ప్రజా విజ్ఞప్తులు ఫిర్యాదులు విషయంలో అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.

రెండు లక్షల 30 వేల అర్జీలలో కేవలం 1000 మినహాయించి మిగతా అన్ని అర్జీలు పరిష్కరించినట్లుగా చూపించారని, ఇది చాలా దుర్మార్గం, అధికారులు అర్జీలను పరిష్కరించారు అని చెప్పడానికి స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం వలన అర్జీదారులతో మాట్లాడిన సరే సమస్య పరిష్కారం అయినట్లుగా చూపిస్తూ అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ విషయంలో అధికారులలో పూర్తిగా మార్పు రాని పక్షంలో, ప్రభుత్వం ఎన్ని మార్గదర్శకాలు చేసిన ప్రజాప్రయోజనం నెరవేరదని ఆయన తెలిపారు. అందుకు నిదర్శనంగా పర్చూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు నమోదైన 839 ఫిర్యాదులు పరిష్కరించినట్లు అధికారులు తెలిపారని, వాస్తవానికి 10 శాతం ఫిర్యాదులు కూడా పరిష్కారం కాలేదని స్పష్టం అవుతుందని ఆయన స్పీకర్ కు

5 వేల మంది సన్నకారు రైతుల సమస్య ప్రస్తావన

పర్చూరు నియోజకవర్గంలో నాలుగు గ్రామాల్లో ఈనామ్ సెటిల్మెంట్ భూములకు సంబంధించి సుమారు 5 వేల మంది సన్న కారు రైతుల భూమి సమస్యలపై కనీసం 50 పర్యాయాలు అధికారులతో మాట్లాడినప్పటికీ, తెలిపారు. సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రి జోక్యం తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోవడం స్పష్టంగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో స్పష్టమైన ప్రభుత్వ విధానాన్ని ప్రవేశ పెట్టకపోతే, ఏదో ఒక సమాధానం ఇచ్చి అధికారులు తప్పించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఎవరైతే వారసత్వంగా అనుభవంలో ఉన్న భూములను కోల్పోయే ప్రమాదం ఉందని ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి తగు సూచనలు చేయాలని ఆయన స్పీకర్ ను కోరారు.

Next Story