- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూఏఈలో "ప్యానిక్ బయ్యింగ్".. ఖాళీ అవుతున్న సూపర్ మార్కెట్లు
యూఏఈలో యుద్ధం భయం కమ్ముకోవడంతో నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు సూపర్ మార్కెట్ల వైపు పరుగులు తీస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. అమెరికా సైనిక స్థావరాలను చోటు ఇస్తున్న కారణంగా ఇరాన్ యూఏఈపై దాడులు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో యూఏఈ (UAE) లోని ప్రధాన నగరాలైన దుబాయ్, అబుదాబి, షార్జాలో మునుపెన్నడూ లేని విధంగా "ప్యానిక్ బయ్యింగ్"(Panic Buying) కనిపిస్తోంది. ప్రజలు మార్కెట్ల వైపు పరుగులు పెడుతున్నారు.
ఏమిటీ "ప్యానిక్ బయ్యింగ్.."?
యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే సముద్ర, వైమానిక మార్గాలు మూతపడి, ఆహార దిగుమతులు నిలిచిపోతాయనే భయం ప్రజల్లో మొదలైంది. దీంతో వేలాది మంది ప్రజలు ఒకేసారి సూపర్ మార్కెట్లపై విరుచుకుపడుతున్నారు. కేవలం కొన్ని గంటల్లోనే బియ్యం, పప్పులు, వంట నూనె, మంచినీటి బాటిళ్ల వంటి అత్యవసర వస్తువుల షెల్ఫ్‌లు పూర్తిగా ఖాళీ అయిపోతున్నాయి. లోకల్ స్టోర్ల నుండి పెద్ద పెద్ద హైపర్ మార్కెట్ల వరకు ప్రతిచోటా గంటల తరబడి క్యూలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబాలతో నివసించే వారు నెలల తరబడి సరిపోయే సరుకులను ఇప్పుడే నిల్వ చేసుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో మార్కెట్‌లో కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది.
3 నెలలకు సరిపడా స్టాక్ ఉంది : యూఏఈ
ఈ ఉద్రిక్త పరిస్థితుల వల్ల కేవలం వస్తువుల కొరత మాత్రమే కాకుండా, ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆన్‌లైన్ గ్రాసరీ డెలివరీ యాప్స్ పై విపరీతమైన రద్దీ పెరగడంతో ఆర్డర్లు డెలివరీ కావడానికి రోజుల సమయం పడుతోంది. యూఏఈ ప్రభుత్వం ప్రజలు ఆందోళన చెందవద్దని, దేశంలో తగినంత ఆహార నిల్వలు, మంచినీళ్లు 3 నెలలకు సరిపడా ఉన్నాయని అధికారికంగా ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా ఉండే ఏరియాల్లో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంది. యుద్ధం కారణంగా అంతర్జాతీయ ఫుడ్ సప్లై చైన్ దెబ్బతింటే, ఎడారి దేశమైన యూఏఈకి ఆహార సంక్షోభం తప్పదన్న ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతోంది.






