హైకమాండ్ వద్దకు 'పాలకుర్తి' పంచాయితీ: మీనాక్షి నటరాజన్‌తో అసమ్మతి నేతల భేటీ

by Malleboina Mahesh |   (  Updated:2026-01-08 06:11:38  IST  )

మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. అధికార కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు తాజాగా రచ్చకెక్కాయి.

హైకమాండ్ వద్దకు పాలకుర్తి పంచాయితీ: మీనాక్షి నటరాజన్‌తో అసమ్మతి నేతల భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. అధికార కాంగ్రెస్ పార్టీ (ruling Congress party)లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు తాజాగా రచ్చకెక్కాయి. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పాలకుర్తి నేతల (Palakurti leaders) పంచాయతీ కాంగ్రెస్ జాతీయ నాయకురాలు మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) వద్దకు చేరింది. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ అసంతృప్తి నేతలు ఆమెతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో తొర్రూరు మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి, పీఏసీ (PAC) చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, సీనియర్ నేత కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి (MLA Yashaswini Reddy,), ఆమె అత్త ఝాన్సీ రెడ్డిల పనితీరుపై అసమ్మతి నేతలు మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిలు మేజర్ గ్రామ పంచాయతీలను గెలిపించుకోవడంలో విఫలమయ్యారని వారు పేర్కొన్నారు. కాగా, తాము మాత్రం తమ సొంత బలంతో పది మేజర్ గ్రామ పంచాయతీలను కైవసం చేసుకున్నామని, పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నా తమకు పార్టీలో సరైన గుర్తింపు దక్కడం లేదని అసమ్మతి నేతలు మీనాక్షి నటరాజన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఆమె ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Read More..

T Congress: వారి పేర్లు బయటపెడుతా.. సొంత పార్టీ నేతల తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Next Story