- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అత్యాచార కేసులో పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మాంకూటతిల్ అరెస్టు
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న పాలక్కాడ్ ఎమ్మెల్యే గురించి తెలిసిందే. ఆయనపై అత్యాచారం, బలవంతపు అబార్షన్ ఆరోపణలతో నమోదైన కేసులో కేరళ హైకోర్టు మధ్యంతర రక్షణ (Interim Protection) కల్పించింది.

దిశ, వెబ్‌డెస్క్: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న పాలక్కాడ్ ఎమ్మెల్యే (Palakkad MLA) గురించి తెలిసిందే. ఆయనపై అత్యాచారం, బలవంతపు అబార్షన్ ఆరోపణలతో నమోదైన కేసులో కేరళ హైకోర్టు మధ్యంతర రక్షణ (Interim Protection) కల్పించింది. జనవరి 21 వరకు ఆయన్ని అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. అయితే తాజాగా అతనిపై మరోసారి ఫిర్యాదు అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కేరళలోని పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మాంకూటతిల్ (Rahul Mankutathil)ను అత్యాచార ఆరోపణల నేపథ్యంలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై దాఖలైన తాజా ఫిర్యాదు ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. శనివారం అర్ధరాత్రి పాలక్కాడ్‌లోని ఒక హోటల్‌లో ఉన్న ఎమ్మెల్యేను పోలీసులు అదుపులోకి తీసుకుని, అక్కడి నుంచి పథనం తిట్టలోని ఏఆర్ (AR) క్యాంపునకు తరలించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేను పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఆయన్ని తిరువళ్ల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు కేరళ పోలీసులు వెల్లడించారు. తాజా ఫిర్యాదు మేరకు ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.






